| ఓదార్పు హస్తం |
| Friday, 09 October 2009 06:50 |
|
తన తండ్రి శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి మరణవార్తను విన్నతర్వాత, ఆయన్ను దేవుడిలా గుండెల్లో గుడికట్టుకుని పూజింజే ఎంతో మంది అభిమానుల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి. కుటుంబంలో వ్యక్తి మరణిస్తే ఎంతటి విషాదం కమ్ముకుంటో శ్రీ వై.ఎస్ జగన్‍మోహన్ రెడ్డి గారికి తెలుసు అందుకే తమ నాన్నగారిపై ఉన్న అభిమానంతో ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను మీకు నేనున్నానంటూ ఓదార్చాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీ నుండి శ్రీ వై.ఎస్.జగన్‍మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర పశ్చిమగోదావరి నుండి ప్రారంభం కానుంది. ఆ యాత్ర యొక్క పూర్తి వివరాలు: 9వ తేదీన : ఏలూరు, ఉంగుటూరు, ఉండి నియోజక వర్గాలలో పర్యటించి రాత్రి భీమవరంలో బసచేస్తారు. 10వ తేదీన : నర్సాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు, తాడేపల్లి గూడెం నియోజక వర్గాలలో పర్యటించి రాత్రి తాడేపల్లి గూడెంలో బసచేస్తారు. 11వ తేదీన : గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, చింతలపూడి నియోజక వర్గాలలో పర్యటించిన అనంతరం ఖమ్మం జిల్లాకు చేరుకుంటారు.
ప్రజానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర దాగివుందంటూ ఒక టీవీ ఛానల్ ప్రసారం చేసిన వెబ్ సైట్ కథనం దిగ్భ్రాంతి కలిగించిందని వై.ఎస్.ఆర్ తనయుడు,కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఈ కథనానికి స్పందించి విధ్వంసాలకు దిగి మరియు బంద్ లకు పిలిపునిచ్చిన ప్రజలను, అభిమానులను దయచేసి సంయమనం పాటించాలని చేతులుజోడించి వేడుకున్నారు. ఆయన చేసిన విజ్ఞప్తి ఆయన మాటల్లోనే..... పిలవకుండానే వచ్చి ప్రజల జీవన స్థితి గతులను మార్చి వారి జీవితాలను నీటితో కొట్టిపారేసిన వరద భీభత్సానికి ఎందరో కూడు,గుడ్డ,నీడ పోగొట్టుకున్నారు. వీరందరికి మన వంతుగా సానుభూతి,పరామర్శలు కాదు కావల్సింది వీరిక్కావల్సింది మన వంతు సాయం. ఆ ముఖ్యోద్దేశ్యంతోనే సాక్షి మీడియా గ్రూప్ తరఫున సాక్షి రిలీఫ్ ఫండ్ ను స్థాపించాం. అందులోభాగంగా మొట్టమొదట జగతి పబ్లికేషన్స్ ద్వారా కోటి రూపాయలు విరాళంతో ఈ ఫండ్ ను ప్రారంభించాం. మా నిర్ణయం తెలిసిన వెంటనే సాక్షి పత్రిక మరియు టి.వి.సిబ్బంది స్పందించి తమ వంతు సాయంగా ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. అలా వచ్చిన ఇరవై ఒక లక్షా ఎనభై వేల రూపాయలు కలిపి మొత్తం కోటి ఇరవై ఒక్క లక్షల ఎనభై వేల రూపాయలతో ఈ ఫండ్ ను ప్రారంభించాము. ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోవడానికి మీ వంతు సాయం చేస్తారని మా కోరిక. మీరందించబోయే అమూల్యమైన ఆర్థిక సహాయాన్ని చెక్కు, డిమాండ్ డ్రాఫ్ట్ లేదా మనీ ఆర్డర్ ల రూపంలో పంపవచ్చును. "సాక్షి రిలీఫ్ ఫండ్" పేరిట ( Sakshi Relief Fund ) హైదరాబాద్ లో చెల్లుబాటయ్యేలా చెక్కులను,డి.డి లను మరియు ఎంవోలను " సాక్షి రిలీఫ్ ఫండ్, 6-3-249/1,సాక్షి టవర్స్, రోడ్ నెంబర్ - 1, బంజారాహిల్స్, హైదారాబాద్ - 500034" చిరినామాకు పంపండి.
|
| Last Updated on Sunday, 11 April 2010 04:22 |
