|
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టటానికి వై.ఎస్ .జగన్మోహన్ రెడ్డి ఆని విధాలా సమర్థుడని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున అన్నారు.రాజ్యసభ సభ్యుడు ,ప్రభుత్వ ప్రధాన సలహా దారు అయిన శ్రీ కే.వి.పి.రామచంద్ర రావుతో శుక్రవారం నాగార్జున భేటి అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే కేవిపి ని కలిశానన్నారు.దిగావంత ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారు లేని లోటుని పూడ్చాలంటే జగనే సి.ఎం.కావాలన్నారు.అధిష్టానం కూడా జగన్ వైపే మొగ్గు చూపుతుందని కేవిపి తనతో అన్నారని నాగార్జున తెలియచేశారు.
ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు ఆంధ్ర జాతి నివాళులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి ఆంధ్ర జాతి శుక్రవారం ఘన నివాళులు అర్పించింది. బుధవారం ఉదయం నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, మరో నలుగురు అధికారులు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ అంతిమయాత్రకు హైదరాబాద్‌లో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి.
దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, హోం మంత్రి చిదంబరం, ఇతర మంత్రులు వీరప్ప మొయిలీ, గులాం నబీ ఆజాద్ సహా ఇతర రాజకీయ ప్రముఖులు శుక్రవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ భౌతికకాయానికి ఘన నివాళులు అర్పించారు. ఏఐసీసీ యువ నేత రాహుల్ గాంధీ కూడా వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా దేశ రాజకీయ ప్రముఖులు సీఎం క్యాంపు కార్యాలయంలో తమ సంతాప సందేశాన్ని రాశారు. వైఎస్సార్ గౌరవార్థం దేశ రాజధానిలో, రాష్ట్ర రాజధానుల్లో జాతీయ జండాను సగానికి అవనతం చేశారు. ప్రజల సందర్శనార్థం శుక్రవారం మధ్యాహ్నం వరకు వైఎస్సార్ భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో ఉంచారు. అనంతరం ఆయన సొంత ఎస్టేట్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో అంత్యక్రియలు నిర్వహించారు.
|