Sunday, 05 Sep 2010
Home

Mail To Me

link_to_jagan

రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలను వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఇవ్వనున్నారని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. ఈ మేరకు ప్రధాని ఆయనకు హామీ ఇచ్చినట్టు ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీలో వెల్లడించారు.
రాష్ట్ర రాజకీయాలపై చర్చించేందుకు ఎంపీ రాయపాటి గురువారం ప్రధాని మన్మోహన్‌తో భేటీ అయ్యారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం బాధ్యతలను జగన్‌కే అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్టు ప్రధాని చెప్పారన్నారు.
వైఎస్ తనయుడు జగన్ ముఖ్యమంత్రిగా చేయాలన్న ప్రజాప్రతినిధుల, ప్రజల అభీష్టాన్ని తాము సోనియా గాంధీకి తెలియచేశామన్నారు.

శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి మరియు ముఖ్యమంత్రి గారైన స్వర్గీయ శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం

శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి మరియు ముఖ్యమంత్రి గారైన స్వర్గీయ శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ప్రజలు అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో "నాన్న గారి కోసం ఏ ఒక్కరూ మరణించినా అయన ఆత్మకు శాంతిచేకూరదని ,పేద  ప్రజల పెదాలపై చిరునవ్వున్నంతకాలం ఆయన ప్రజల గుండెల్లో చిరంజీవిగా వుంటారని, కాబట్టి మీరు ఎలాంటి అఘాయత్యాలకు పాల్పడవద్దని మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.అంతేకాక మనందరం కలిసి ఆయన ఆశయసాధనకు కృషిచేయాలని" పిలుపునిచ్చారు.