Sunday, 05 Sep 2010
Home Profile

Mail To Me

link_to_jagan

నేను కడప జిల్లా యవతకు విద్య,ఉద్యోగావకాశాలను కల్పించటానికి మరియు ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలను అందచేయటానికి నా శాయశక్తులా కృషిచేస్తాను.పేద ప్రజల బ్రతుకుల్లో అభివృద్దే దేశాభివృద్దికి దోహదం చేస్తుందని నమ్ముతున్నాను.దానికోసం అహర్నిశలు కష్టపడి నా జీవితాన్ని సైతం అంకితం చేస్తానని తెలియచేస్తున్నాను.

పరిచయం:
శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు 1972 వ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా లోని పులివెందుల గ్రామంలో
శ్రీ
వై.ఎస్.రాజశేఖర రెడ్డి,విజయలక్ష్మి  దంపతులకు జన్మించారు.
శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మారుమూల గ్రామాలలో పరిశ్రమలు నెలకొల్పటం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి,
వారిని అభివృద్ధి దిశగా నడపటమే ముఖ్యోద్దేశ్యంగా పారిశ్రామిక వేత్తగా మారి "జనంకోసం జగన్ "అని ప్రజల చేత అనిపించుకుంటున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని యువకులంతా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని 'తమని అభివృద్ధి పథం వైపు నడిపే యువనాయకుడిగా భావిస్తున్నారు.
విద్యార్హత :
శ్రీ వై .ఎస్.జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధమిక విద్యాభ్యాసమంతా కడప జిల్లాలోని పులివెందుల గ్రామంలోనే జరిగింది. తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (M.B.A) విద్యనభ్యసించారు.కళాశాలలో చదివే రోజుల్లో క్రీడల్లో కీలక పాత్రవహించేవారు.ముఖ్యంగా క్రికెట్ క్రీడలో ప్రావీణ్యం తో పాటు ,చాలా పతకాలు కూడా సంపాదించారు.
వృత్తి:
శ్రీ వై .ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు తన వృత్తి పరమైన జీవితాన్ని వ్యాపార రంగం ద్వారా ప్రారంభించి ,లాభార్జనే ధ్యేయంగా కాకుండా సమాజం,ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ పేదప్రజల పెదవులపై చిరునవ్వుని చూడాలని దానికొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ,చేయిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
రాజకీయ రంగం:
అతిచిన్న వయస్సునుండే పేదప్రజలకు తన వంతు సాయం చేయాలనే ధృడసంకల్పంతో ,అప్పటి ప్రధాన మంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి మరియు
మాజీ
ముఖ్యమంత్రి,తన తండ్రి గారైన డా.శ్రీ .వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి ఆదర్శంతో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ లో సభ్యత్వం తీసుకోవటంతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ రంగానికి పునాదులు పడ్డాయి.అలా మొదలైన రాజకీయ ప్రస్థానంలో ప్రజల అభిమాన,అండదండలతో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా అఖండ మెజారిటీతో ఎన్నికయ్యారు.
సాంఘిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు :
శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా జీవితంలో ముఖ్యంగా స్త్రీ శిశు సంక్షేమానికి మరియు సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంస్థలను స్థాపించి వాటి ద్వారా సహాయ సహకారాలను అందిస్తున్నారు.