|
ప్రజానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర దాగివుందంటూ ఒక టీవీ ఛానల్ ప్రసారం చేసిన వెబ్ సైట్ కథనం దిగ్భ్రాంతి కలిగించిందని వై.ఎస్.ఆర్ తనయుడు,కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఈ కథనానికి స్పందించి విధ్వంసాలకు దిగి మరియు బంద్ లకు పిలిపునిచ్చిన ప్రజలను, అభిమానులను దయచేసి సంయమనం పాటించాలని చేతులుజోడించి వేడుకున్నారు. ఆయన చేసిన విజ్ఞప్తి ఆయన మాటల్లోనే..... " నాన్నగారు ప్రాయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురికావటం వెనుక కుట్ర దాగి ఉందన్న కథనం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ ప్రమాదానికి సంబంధించి నాకూ కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ,దేశంలోనే అత్యున్నత కేంద్ర నేర పరిశోధన సంస్థ ( సీబీఐ ) ఇప్పటికే విచారణ చేపట్టినందున వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నాను. హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర దాగిఉందని చెప్పటానికి ఉన్న ఆధారాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలి, విచారణ ప్రక్రియ సవ్యంగా ముందుకు సాగేలా సహకరించాలి. కుట్ర కోణంలో దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని కోరుతాం. ప్రజలు సంయమనం పాటించాలి. విధ్వంసాలకు పాల్పడవద్దు. నాన్నగారి ఆత్మకు శాంతి చేకూరాలంటే రాష్ట్రప్రజలు సంతోషంగా వుండాలి.ఇప్పటికే ఆందోళనలు, బంద్ లతో రాష్ట్రప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ తరుణంలో వారికి మళ్ళీ కష్టాలు కలిగించవద్దని చేతులుజోడించి వేడుకుంటున్నాను".
హైదరాబాద్ లో సాక్షి టి .వి. ప్రారంభోత్సవ వేడుక : ఆగ్నేయ ఆసియాలోనే తోలి హై డెఫినేషన్ గల తెలుగు న్యూస్ చానెల్ ప్రారంభోత్సవం విశిష్ట అతిధుల సాక్షిగా ,తళుకు బెళుకుల మధ్య అత్యత్భుతంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో శనివారం జరిగింది. సాక్షి దినపత్రిక అధిపతి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడైనందువల్ల వేదిక ప్రముఖ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో నిండిపోయింది.ఈ సందర్భంగా ప్రేత్యేకంగా లేసేర్ షో మరియు ప్రముఖ బాలీవుడ్ నృత్యదర్శకులచే డాన్స్ షోలు ఏర్పాటుచేయటం జరిగింది.
ఆస్ట్రేలియా నుండి వచ్చిన Tracy Jeffery బృందం నిర్వహించిన లేజర్ షో ,Terrance Lewis drew బృందం నిర్వహించిన నృత్యకళారీతులు మరియు ముంబై ముద్దుగుమ్మలచే నిర్వహించిన ఫాషన్ షోలకు మంత్రముగ్దులైన ప్రేక్షకులే సాక్షి.
తెలుగు పత్రికా రంగంలోనే అతి కొద్ది కాలంలోనే నిస్పక్షపాత ధోరణితో కొత్త ఒరవడి సృష్టించిన సాక్షి దిన పత్రిక యొక్క ప్రామాణికాలను కొనసాగిస్తూ తెలుగు వార్తా చానెల్ రంగంలో మార్చి ఒకటవ తేదీనుండి 24 గంటలు ప్రసారం కాబోతుందని శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు తెలియచేశారు.
గౌరనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎన్.డి.తివారీ గారు,ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారు,కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి శ్రీ ఆనంద్ శర్మ గారు,స్పీకర్ కే.ఆర్.సురేష్ రెడ్డి గారు,ఏ.ఐ.సి.సి. జనెరల్ సెక్రటరి శ్రీ ఎం.వీరప్ప మెయిలీ గారు,ఏ.పి.సి.సి. చీఫ్ డి.శ్రీనివాస్ గారు ,బి.జే.పి.పార్టీ అధ్యక్షులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు,ఎం.ఐ.సి.పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఒవైసీ గారు ,ప్రజారాజ్యం పార్టీ జెనెరల్ సెక్రెటరి శ్రీ అల్లు అరవింద్ గారు ,లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు శ్రీ జయప్రకాశ్ నారాయణ్ గారు మరియు సినిమా తార శ్రీ అక్కినేని నాగార్జున గారు ఈ కార్యక్రమ్మనికి హాజరయ్యారు.
|