Sunday, 05 Sep 2010
Home Press Releases

Mail To Me

link_to_jagan
శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు టి.డి.పి.ని ఉద్దేశించి "తెలుగుదేశం పార్టీ పారిశ్రామిక వేత్తలని భయపెట్టటం,రాజకీయ లబ్దికోసం నిజాలను వక్రీకరించటం మానుకోవాలని హితవు పలికారు.వాళ్ళ హయాంలో ఒక్క పరిశ్రమనికూడా స్థాపించలేక పోయారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఎటువంటి ప్రకటన చేయకున్నా అది నాటకీయంగా చోటుచేసున్నదేనని వివరించారు.

" నా తండ్రి నారా చంద్ర బాబుని ఉద్దేశించి అన్నమాటల్లో నాకు ఎటువంటి తప్పు అనిపించలేదు. ఆయన గొప్ప వక్త తానూ చెప్పాలనుకున్నది నాటకీయపరిభాషలో ఎం.టి.రామారావు గారి లాగా చెప్పారు.చంద్రబాబు నాయుడు మరియు టి.డి.పి.నాయకులు కేవలం సభను తప్పుదోవపట్టించాలనే దురుద్దేశంతోనే అయన మాటలను వక్రీకరించారు.ఓబులాపురం గనులకు లీజు అనుమతికి సంబంధించి చంద్ర బాబు హయంలోనే ఉత్తర్వులు జారీ చేయబడ్డాయని ఎక్కడ
స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు సాక్ష్యాలను సమర్పితారోనని ఇదంతా చేశారని పత్రికకు తెలియచేశారు.

సాక్షి పత్రిక గురించి తెలియచేస్తూ "ఇది ఎటువంటి తారతమ్యాలు లేకుండా,సమనత్వంగా అన్ని రంగాల విషయాలను తెలియచేస్తుందని మరియు దీనికి సంబంధించి కడపలో పేపర్ ఎడిషన్ కు గాను భవనము నిర్మాణంలో వుందని చెప్పారు.

తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రస్తావించగా " భవిష్యత్తుని ఇప్పుడే చెప్పలేమని ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మరియు తెలుగుదేశం పార్టి నాయకులు రాయలసీమగురించి చెడుగా చెప్పొద్దని, కడపలో పరిశ్రమల నిర్మాణానికి అడ్డుపడి అభివృద్దిని ఆపొద్దని హితవు పలికారు.

కడప జిల్లాలోని జమ్మల మడుగు నియోజక వర్గంలో నిర్మిస్తున్న బ్రాహ్మిణి స్టీల్ ఇండస్ట్రీ నిర్మాణానికి అడ్డుకట్ట వేయొద్దని మరియు దానికి సహాయ సహకారాలందిస్తున్నపారిశ్రామిక వేత్త శ్రీ గాలి జనార్ధన్ రెడ్డి గారిని భయపెట్టి బ్రాహ్మిణి స్టీల్ ఇండస్ట్రీని కర్ణాటకలోని బళ్ళారికి తరలించే ప్రయత్నం మానుకోవాలని చెప్పారు.తెలుగుదేశం నాయకులు పరిశ్రమలు నెలకొల్పుతామంటూ వస్తున్న పారిశ్రామిక వేత్తలను ఆహ్వ్వానించాల్సింది పోయి అవరోధాలు కల్పిస్తున్నారని వీళ్ళని కడప ప్రజలు క్షమించరని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు.

శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఓబులాపురం గనులలో తనకు అక్రమంగా వాటా ఉందన్న ఆరోపణలను ఖండించారు. బినామి పేర్ల మీద ఆస్తులను, పరిశ్రమలను సంపాదించడం తనకు అవసరం లేదని, తన తండ్రి ముఖ్య మంత్రి అవ్వక మునుపు నుండే తనకు అనేక పరిశ్రమలు, లైం స్టోన్ గనులు ఉన్నాయని వివరించారు.
Read More