Sunday, 01 Aug 2010
Home

Mail To Me

link_to_jagan

Login Form



రాజకీయ పర్యటన కాదు: జగన్ PDF Print E-mail
Sunday, 11 April 2010 03:57

మనలో ఒకరిగా, ప్రతి పేద కుటుంబానికి పెద్ద దిక్కుగా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించిన దివంగత మహానేత, నా తండ్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి మన మధ్య లేరంటే ఇప్పటికీ నమ్మాలనిపించటం లేదు. నాతో సమానంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయనను నిరంతరం ఏదోరీతిన స్మరించుకుంటూనే ఉన్నారు. ఆ మహానేత అకాలమరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపేందుకు నేను వారిదగ్గరకు వెళ్లాలనుకున్నాను. వారిని పలకరించాలని, బాధల్లో ఉన్న వారికి మీకు నేనున్నానంటూ అండగా నిలవాలని,  ప్రతి నెలా రెండు లేదా మూడు జిల్లాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే మొదటి విడతగా పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల

నుండి ఈ నెల 9న పర్యటన ప్రారంభిస్తున్నాను. ఈ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదు. మహానేత కోసం మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు మాత్రమే వారిని కలవాలని, నా వంతు వారికి ధైర్యం చెప్పాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. కానీ నేనే నా బాధ నుంచి బయటపడటానికి కొంత సమయం తీసుకుంది. కొన్ని పరిస్థితులు అనుకూలించలేదు. ఇచ్చిన మాట ప్రకారం వారిని కలిసి ఆత్మీయతను పంచుకునేందుకు బయలుదేరే సమయం రావడం నాలో ఎంతో ఉద్వేగాన్ని కలిగిస్తోంది. వేదనతో కూడుకున్నదే అయినా వారికి అండగా నిలవాలన్న కాంక్ష నన్ను ముందుకు నడిపిస్తోంది. నా పర్యటనను పార్టీ కార్యకర్తలు, నాయకులు అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. నా పర్యటనలో ఎక్కడా టపాకాయలు, పూలు, దండల్లాంటి ఆర్భాటాలకు తావివ్వరాదన్నది నా అభిప్రాయం. అలాగే సభలకు, రాజకీయ ఉపన్యాసాలకు దూరంగా ఉండాలన్నది నా అభిమతం. ఎందుకంటే ఇది ఏమాత్రం రాజకీయ పర్యటన కాదు. నాన్నకోసం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ధైర్యాన్నిచ్చేందుకు మాత్రమే. ఈ సందర్భంగా నన్ను కలవడానికో, చూసేందుకో మీ పనులు చెడగొట్టుకోవద్దు. మీ వీలును బట్టి మాత్రమే తప్ప....ప్రత్యేకంగా మీ కార్యకాలు వాయిదా వేసుకుని నాతో పాల్గొనాల్సిన ఒత్తిడి లేదు. ఎవరైనా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నాన్న మీద ప్రేమతో పాలుపంచుకోవాలనుకుంటే దాన్ని కూడా పెద్ద మనసుతో ఆహ్వానిద్దాం. నాన్న చనిపోతూ ఈ రాష్ట్రంలో అతిపెద్ద కుటుంబంలో నన్ను ఒక సభ్యుడిని చేసిపోయారు. తమ్ముడిలా నన్ను ఆదరించిన ప్రతి కుటుంబ సభ్యుడి ఆప్యాయతలో పాలుపంచుకునేందుకు వస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కేవలం వ్యక్తిగత పర్యటనగా మాత్రమే భావించవలసిందిగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.

 

Last Updated on Sunday, 11 April 2010 04:24
 
ఓదార్పు హస్తం
Friday, 09 October 2009 06:50

తన తండ్రి శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి మరణవార్తను విన్నతర్వాత, ఆయన్ను దేవుడిలా గుండెల్లో గుడికట్టుకుని పూజింజే ఎంతో మంది అభిమానుల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి. కుటుంబంలో వ్యక్తి మరణిస్తే ఎంతటి విషాదం కమ్ముకుంటో శ్రీ వై.ఎస్ జగన్‍మోహన్ రెడ్డి గారికి తెలుసు అందుకే తమ నాన్నగారిపై ఉన్న అభిమానంతో ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను మీకు నేనున్నానంటూ ఓదార్చాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీ నుండి శ్రీ వై.ఎస్.జగన్‍మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర పశ్చిమగోదావరి నుండి ప్రారంభం కానుంది. ఆ యాత్ర యొక్క పూర్తి వివరాలు:

9వ తేదీన    :       ఏలూరు, ఉంగుటూరు, ఉండి నియోజక వర్గాలలో పర్యటించి రాత్రి భీమవరంలో బసచేస్తారు.

10వ తేదీన   :        నర్సాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు, తాడేపల్లి గూడెం నియోజక వర్గాలలో పర్యటించి రాత్రి తాడేపల్లి గూడెంలో బసచేస్తారు.

11వ తేదీన    :        గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, చింతలపూడి నియోజక వర్గాలలో పర్యటించిన అనంతరం ఖమ్మం జిల్లాకు చేరుకుంటారు.

 

Last Updated on Sunday, 11 April 2010 04:22
Read more...
 
రాజకీయం కాదు.....ధైర్యం నింపేందుకే

తన తండ్రి మరణించారన్న విషయాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలుకోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి చేపట్టిన పర్యటనకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి తనయుడు, కడప ఎంపీ వైఎస్. జగన్‍మోహన్‍రెడ్డి పత్రికలకు ప్రకటన ద్వారా తెలియజేశారు. "దిగవంత నేత మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కలిసి ఓదార్చాలని ఎప్పుడో నిర్ణయించుకున్నా.....కానీ, కొన్ని పరిస్థితులు అనుకూలించలేదని పేర్కొన్నారు. వారిని కలిసి ఆత్మీయతను పంచుకునేందుకు బయలుదేరే క్షణాలు తనలో ఉద్వేగాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు తనను అర్థం చేసుకుని ఆర్భాటాలకు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా కేవలం వ్యక్తిగత పర్యటనగా మాత్రమే భావించాలని కోరారు.

Read more...